- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేలంలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన 'Bugatti' కారు
దిశ, వెబ్‌డెస్క్: ఫ్రెంచ్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగట్టి('Bugatti') కి చెందిన కొత్త మోడల్ ఇటీవల జరిగిన వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయి, ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 'బుగట్టి చిరోన్ ప్రొఫైల్' కారును RM సోథెబీస్ వేలానికి పెట్టింది. దీనిలో ఈ కారు అత్యధికంగా రూ. 87 కోట్లకు పైగా ($10.76 మిలియన్లు) అమ్ముడుపోయి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కారును కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 1న నిర్వహించిన వేలంలో కారు $4.5 మిలియన్ల నుండి $6 మిలియన్ల మధ్య అమ్ముడుపోతుందని అంచనా వేసినప్పటికి అనుకున్నదానికంటే రెండింతలకు పైగా లాభం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
'బుగట్టి చిరోన్ ప్రొఫైల్' కారు 1,479 హార్స్‌పవర్, 1,180 lb-ft టార్క్‌తో 8.0-లీటర్ క్వాడ్-టర్బో W16 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 0 నుండి 2.3 సెకన్లలో 100 కి.మీ/గం, 5.5 సెకన్లలో గంటకు 200 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 380 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ప్రత్యేకమైన హైపర్ స్పోర్ట్స్ కారు ముందు భాగంలో విశాలమైన ఎయిర్ ఇన్‌లెట్‌లు, రేడియేటర్లలోకి మరింత చల్లని గాలిని పంపడానికి బుగట్టి హార్స్‌షూ గ్రిల్‌ను అమర్చారు.
SOLD: The first and only "pre-series" @Bugatti Chiron Profilée for €9,792,500 #RMParis pic.twitter.com/RUuC83N6tD
— RM Sotheby's (@rmsothebys) February 1, 2023