Budget 2024: యూనియన్ బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు

by Harish |   ( Updated:2024-07-23 07:54:18.0  )
Budget 2024: యూనియన్ బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: యూనియన్ బడ్జెట్ 2024 ను రూ.48.21 లక్షల కోట్ల పరిమాణంతో తీసుకొచ్చారు. దీనిలో దేశ ఆర్థికాభివృద్ధి కోసం ముఖ్యమైన అన్ని రంగాలకు కేటాయింపులు చేశారు.

* మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్లు

* ముద్రా రుణాల పరిమితి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెరుగుదల

* దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులు ధృవీకరణ, బ్రాండింగ్ ద్వారా సహజ వ్యవసాయంలోకి తీసుకురావడం.

* పప్పులు, నూనె గింజలలో దేశీయంగా ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకోవడం.

* బంగారం, వెండిపై 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి కస్టమ్‌ డ్యూటీని తగ్గించారు.

* క్యాన్సర్‌ రోగుల మందులపై సుంకం ఎత్తివేత

* ఈ-కామర్స్ ఆపరేటర్లపై TDS రేటు 1% నుండి 0.1%కి తగ్గింపు

* 1 కోటి గృహాలు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందేందుకు వీలుగా రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజనను కూడా ప్రారంభించారు.

* క్యాపిటల్‌ గెయిన్స్‌ విధానం సరళీకరణలో లాంగ్‌ టర్మ్‌ గెయిన్స్‌పై 12.5 శాతం పన్ను, క్యాపిటల్‌ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు చేశారు.

Advertisement

Next Story