ఆదాయం, ఖర్చుల ఆధారంగా బడ్జెట్ -2024

by Harish |   ( Updated:2024-02-01 07:21:40.0  )
ఆదాయం, ఖర్చుల ఆధారంగా బడ్జెట్ -2024
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ రోజు ప్రస్తుత ప్రభుత్వ చివరి మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్టమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలపనుంది.ఈ బడ్జెట్‌ ఎన్నికల ముందు వస్తున్న తరుణంలో పలు వరాలను కురిపించే అవకాశం ఉంది. పీఎం కిసాన్ సాయం పెంపు, ఆయుష్మాన్ భారత్ కవరేజ్ పెంపుతో పాటు పలు కీలక అంశాలపై ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో మొత్తం ఆదాయం, ఖర్చులు, కేటగిరీల వారీగా పన్నుల రాబడి, ప్రభుత్వ వ్యయం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని బడ్జెట్ పరిమాణం ఉంటుంది. ముందస్తు అంచనాల ప్రకారం, ఆదాయం ఈ సంవత్సరం జీడీపీలో 9.2 శాతంగా ఉంటుంది. దానికి తగ్గట్లుగా వెనకబడిన వారి కోసం ప్రభుత్వం తన కేటాయింపులను చేయనుంది. ద్రవ్యలోటు 2021లో గరిష్టంగా 9.2 శాతానికి చేరుకోగా, ఇది 2024 ఆర్థిక సంవత్సరానికి 5.9 శాతానికి తగ్గుతుందని అంచనా.

కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం, 2023 నవంబర్ నాటికి ప్రభుత్వ ఆర్థిక లోటు రూ. 9.06 ట్రిలియన్లుగా నమోదైంది. ఇది ప్రభుత్వ లక్ష్యానికంటే తక్కువగా ఉంది. 2023లో పన్ను- జీడీపీ నిష్పత్తి 11.1 శాతంగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇది స్థిరంగా ఉండే అవకాశం ఉంది. సీజీఏ డేటా ప్రకారం, 2023 నవంబర్ నాటికి కేంద్రం రూ. 26.52 ట్రిలియన్లను ఖర్చు చేసింది. మొత్తంగా 2024 బడ్జెట్ జీడీపీలో 14.9 శాతంగా ఉండవచ్చని అంచనా.

Read More..

బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులుంటాయా?.. రేవంత్ సర్కార్ ఆశలు

Advertisement

Next Story

Most Viewed