- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుడ్‌న్యూస్.. రెండు ప్లాన్‌లపై వాలిడిటీ పెంచిన టెలికాం కంపెనీ
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) తన వినియోగదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా తన రెండు ప్లాన్లపై ప్రస్తుతం ఉన్న వాలిడిటీని పెంచింది. రూ. 699 ప్లాన్‌పై సాధారణంగా 130 రోజుల వాలిడిటీ లభిస్తుండగా, ఇప్పుడు దీనిని మరో 20 రోజులకు పెంచింది. దీంతో ప్రస్తుతం ఈ ప్లాన్ కాలపరిమితి 150 రోజుల వరకు ఉంటుంది. అలాగే రూ. 999 ప్లాన్‌పై వాలిడిటీ 200 రోజులు కాగా, దానిని 15 రోజులకు పెంచారు. దీంతో ఈ ప్లాన్‌పై రీచార్జ్ చేసుకున్న వారికి 215 రోజుల వాలిడిటీ లభిస్తుంది. కాలపరిమితి అప్‌డేట్‌కు సంబంధించి BSNL వెబ్‌సైట్‌లో, యాప్‌లో మార్పులు చేసింది.
అయితే ఇటీవల కంపెనీ రూ. 99 ప్లాన్ వాలిడిటీని తగ్గించింది, ఈ ప్లాన్ గతంలో 18 రోజుల కాలపరిమితి కలిగి ఉండగా, దీనిని 17 రోజులకు తగ్గించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే BSNL గత కొన్నేళ్లుగా కస్టమర్లను పోగొట్టుకుంటుంది. మిగతా టెలికాం కంపెనీల కంటే ఆలస్యంగా 4G ని ప్రారంభించింది. ప్రస్తుతం 5G ట్రెండ్ నడుస్తున్న తరుణంలో కస్టమర్లు 5G నెట్‌వర్క్ ఇచ్చే సంస్థలకు మారుతున్నారు.