BSNL: ఓటీటీ లవర్స్ కి గుడ్ న్యూస్.. రూ.119 కే జీ5, డిస్నీ, సోనీ లివ్ సబ్‌స్క్రిప్షన్..!

by Prasanna |
BSNL: ఓటీటీ లవర్స్ కి గుడ్ న్యూస్..  రూ.119 కే  జీ5, డిస్నీ, సోనీ లివ్  సబ్‌స్క్రిప్షన్..!
X

దిశ, ఫీచర్స్: సినిమా టికెట్ కి రూ .250 పెట్టడం కన్నా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఇంట్లో చూడటం బెటర్ అని ఓటీటీ లవర్స్ అంటున్నారు. ప్రస్తుతం, థియేటర్ కంటే ఓటీటీలకే డిమాండ్ పెరుగుతుంది. థియేటర్ లో అయితే ఒక్క సినిమానే చూడొచ్చు.. అదే ఓటీటీల్లో అయితే చాలా ఉంటాయి. దీన్నే దృష్టిలో పెట్టుకుని ఓటీటీ లవర్స్ కి బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం కొత్త ప్లాన్స్ తీసుకొచ్చాయి. బీఎస్ఎన్ఎల్ కస్టమర్‌లకు OTT సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఏ విధంగా అందించనుందో ఇక్కడ తెలుసుకుందాం.. అందిస్తున్నాయి.

BSNL సినిమా ప్లస్

ఇప్పుడు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే ఓటీటీ ప్లాన్‌లను కస్టమర్‌ల ముందుకు తీసుకొచ్చింది. ఈ కంపెనీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర రూ. 49 నుంచి రూ. 250 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్ పేరే బీఎస్ఎన్ఎల్( BSNL) సినిమా ప్లస్.

BSNL ఓటీటీ ప్లాన్ వివరాలు

BSNL రూ. 49 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే షెమరూ, హంగామా, లయన్స్‌గేట్ అందుబాటులో ఉంటాయి.

BSNL రూ. 119 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే జీ5 ప్రీమియం, సోనీ లివ్ ప్రీమియం, యప్ టీవీ , డిస్నీ + హాట్‌స్టార్ అందుబాటులో ఉంటాయి.

BSNL రూ. 249 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే, జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, సోనీ లివ్ ప్రీమియం, యప్ టీవీ, షెమరూ, , హంగామా, లయన్స్‌గేట్, డిస్నీ హాట్ స్టార్ ను పొందవచ్చు.

Advertisement

Next Story