దేశీయంగా తయారైన కొత్త కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ ఇండియా!

by Vinod kumar |   ( Updated:2023-09-11 16:29:53.0  )
దేశీయంగా తయారైన కొత్త కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ ఇండియా!
X

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా దేశీయ మార్కెట్లో తన కొత్త కారును విడుదల చేసింది. స్థానికంగా ఉత్పత్తి చేసిన 630ఐ ఎం స్పోర్ట్ సిగ్నేచర్ మోడల్‌ను చెన్నైలో ఉన్న తయారీ ప్లాంటులో తయారు చేసినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ధరను రూ. 75.90 లక్షలుగా నిర్ణయించామని, ప్రస్తుతానికి పెట్రోల్ వేరియంట్ మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించింది.

2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన ఈ కారు కేవలం 6.5 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. డిజైన్ పరంగా ఎం స్పోర్ట్ సిగ్నేచర్ తరహాలోనే ఉంటుందని, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కీ-లెస్ ఎంట్రీ, రిమోట్ పార్కింగ్, రివర్స్ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లను అందించాం. భద్రతా పరంగా ఆరు ఎయిర్‌బ్యాగులతో పాటు అన్ని సీట్లకు త్రీ-పాయింట్ సీట్ బెల్ట్ సౌకర్యాలను అందించామని కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed