BIG News: చిప్ దిగ్గజం INTEL సంచలన నిర్ణయం.. 18 వేల ఉద్యోగుల తీసివేతకు రంగం సిద్ధం

by Shiva |
BIG News: చిప్ దిగ్గజం INTEL సంచలన నిర్ణయం.. 18 వేల ఉద్యోగుల తీసివేతకు రంగం సిద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: బహిరంగ మార్కెట్‌లో క్షణిస్తున్న మార్కెట్ వాటాను ఎదుర్కొనేందుకు, కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణకు INTEL దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ మేరకు 15 శాతానికి పైగా ఉద్యోగులను తగ్గించుకోబోతున్నట్లు గురువారం సంచలన ప్రకటన చేసింది. కాగా, ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీకి 1.6 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ఈ ఏడు వ్యయాలను సుమారు 20 బిలియన్ డాలర్ల మేర కుదించుకునేలా INTEL ప్లాన్ చేస్తోంది. ఉత్పత్తి, ప్రాసెస్ టెక్నాలజీ పరంగా లక్ష్యాలను చేరినా.. సెకెండ్ క్వార్టర్‌లో కంపెనీ ఆర్థిక పనితీరు నిరాశపరిచిందని సీఈవో పాట్ గెల్సింగర్ పేర్కొన్నారు.

కాగా, ఇంటెల్ కంపెనీలో గత ఏడాది చివరి నాటికి 1,24,800 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందులో నుంచి 15 శాతం మందిని తొలగిస్తే దాదాపు 18,000 మందిపై ప్రత్యక్షంగా ప్రభావం పడొచ్చని అర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంచనాగా ఉంది. ప్రత్యర్థులు ఎన్వీడియా, ఎఎమ్‌డి మరియు క్వాల్‌కామ్‌ల నుండి బలమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఇంటెల్ ధిక్కరించిన ఒక నెల తర్వాత బెల్ట్-బిగింపు వచ్చింది, కృత్రిమ మేధస్సు విప్లవానికి దారితీస్తుందని సాంకేతికతలను ఆవిష్కరించింది. అయితే, దశాబ్ధాలుగా ఇన్‌టెల్ చిప్ మార్కెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. కానీ ఈ మధ్య దానికి పోటీగా ఎన్వీడియా, ఏఎండీ, క్వాల్‌కామ్ వంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఎదరవడంతో ఇన్‌టెల్ సెల్స్ పూర్తిగా పడిపోయాయి.

Advertisement

Next Story