- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో అమల్లోకి రానున్న కార్ల స్టార్ రేటింగ్ విధానం!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ రంగంలో తయారైన కార్లలో భద్రతా ప్రమాణాల ఆధారంగా గ్లోబల్ ఎన్‌క్యాప్, యూరోఎన్‌క్యాప్ సంస్థలు స్టార్ రేటింగ్ ఇస్తాయనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు భారత్‌లో తయారయ్యే వాటితోపాటు, విదేశాల్లో తయారైన కార్లకు కూడా ఈ సంస్థలే రేటింగ్ ఇస్తున్నాయి. అయితే, రెండేళ్ల క్రితం భారత్‌లో విడులయ్యే కార్లకు ఇక్కడి సంస్థ రేటింగ్ ఇవ్వాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 22న భారత ఎన్‌క్యాప్(భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) పేరుతో వస్తున్న ఈ రేటింగ్ విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు.
ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల అయింది. దేశంలో మోటార్ వాహనాల భద్రతా ప్రమాణాలను మెరుగుపరుస్తూ, 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న వాహనాలకు భారత్ ఎన్‌క్యాప్ విధానాన్ని వర్తింపజేయనున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉండే మోటార్ వాహనాల క్రాష్ సేఫ్‌టీని అంచనా వేసే సాధనాన్ని వినియోగదారులకు అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం అని అధికారిక ప్రకటనలో మంత్రిత్వ శాఖ పేర్కొంది. కార్ల తయారీదారులు తమ కార్లను స్వచ్ఛందంగా క్రష్ టెస్ట్‌కు ఆఫర్ చేయవచ్చు. పరీక్షల్లో కారు పనితీరు ఆధారంగా పెద్దలు, పిళ్లల రక్షణకు సంబంధించి రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది.