వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్!

by Harish |   ( Updated:2023-05-17 12:08:23.0  )
వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచే ప్రతికూలంగా ర్యాలీ చేసిన సూచీలు చివరి వరకు అదే ధోరణిలో ట్రేడయ్యాయి. అమెరికా ఈక్విటీ మార్కెట్లలో బలహీన ర్యాలీ కారణంగా గ్లోబల్ మార్కెట్లు నీరసించాయి. ఆ ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. దేశీయంగా కీలకమైన ఐటీ, రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనబడింది. దీనికి తోడు దిగ్గజ కంపెనీలైన ఇన్ఫోసిస్, రిలయన్స్ షేర్లలో అమ్మకాలు పెరగడంతో మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 371.83 పాయింట్లు నష్టపోయి 61,560 వద్ద, నిఫ్టీ 104.75 పాయింట్లు కోల్పోయి 18,181 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, రియల్టీ, ఐటీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకి, అల్ట్రా సిమెంట్, ఎంఅండ్ఎం కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. కోటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఏషియన్ పెయింట్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, విప్రో స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.38 వద్ద ఉంది.

Also Read..

అదానీ గ్రూప్‌పై ఆరోపణల దర్యాప్తునకు సెబీకి గడువు పొడిగింపు!

Advertisement

Next Story