మీకు ఆదాయం లేదా.. అయితే ఈ విధంగా కూడా Credit Cards పొందవచ్చు

by Harish |   ( Updated:2022-10-27 05:06:29.0  )
మీకు ఆదాయం లేదా.. అయితే ఈ విధంగా కూడా Credit Cards పొందవచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకులు సాధారణంగా క్రెడిట్ కార్డులను వినియోగదారులందరికీ కాకుండా ఎంపిక చేసిన వారికి అనగా ఆదాయం, బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్ బిల్లుల చెల్లింపు సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకుని క్రెడిట్ కార్డ్‌లను జారీ చేస్తాయి.

క్రెడిట్ బిల్లులను తిరిగి చెల్లిస్తారు. అనుకునే వారికి మాత్రమే బ్యాంకులు క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి. తిరిగి చెల్లించే స్థోమత లేని వారికి మాత్రం క్రెడిట్ కార్డులను ఇవ్వవు. కానీ వ్యక్తిగత ఆదాయం లేకున్నా కూడా బ్యాంకులు కొన్ని లావాదేవీలను అనుసరించి క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం..

* బ్యాంక్ బ్యాలెన్స్

కొన్ని కంపెనీలు దరఖాస్తుదారుల బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఆధారంగా చేసుకుని క్రెడిట్ కార్డును జారీ చేస్తాయి. దీని కోసం వినియోగదారులు తమ బ్యాంకు స్టేట్‌మెంట్‌ను సబ్మిట్ చేయాలి. పెద్ద మొత్తంలో రెగ్యులర్ ట్రాన్సక్షన్స్ చేసే వారు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించి కూడా క్రెడిట్ కార్డు పొందవచ్చు.

* మ్యూచ్‌వల్ ఫండ్స్

వినియోగదారులకు మ్యూచ్‌వల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు ఉన్నట్లయితే దీనిని బేస్ చేసుకుని కూడా కంపెనీలు క్రెడిట్ కార్డులను ఇస్తాయి. మ్యూచ్‌వల్ ఫండ్లలో పెట్టిన ఇన్వెస్ట్‌ను కంపెనీలు సెక్యూరిటీ డిపాజిట్ లాగా పరిగణిస్తాయి. బిల్లుల చెల్లింపులను ఎగ్గోట్టినట్లయితే, బ్యాంకులు మ్యూచ్‌వల్ ఫండ్ల నుంచి తిరిగి తమ డబ్బును రాబట్టుకుంటాయి.

* ఫిక్స్డ్ డిపాజిట్లు

ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా వివిధ బ్యాంకులు సెక్యూరిటీగా పరిగణించి క్రెడిట్ కార్డును జారీ చేస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్‌లో 75 నుంచి 90 శాతాన్ని క్రెడిట్ కార్డు పరిమితిగా విధిస్తారు.

ఒకే ఇంట్లో ఒకరికి క్రెడిట్ కార్డు ఉండి, వారి ట్రాన్సక్షన్ స్టేటస్‌లు బాగుంటే వారిని పరిగణలోకి తీసుకుని కుటుంబసభ్యుల్లో ఇంకొకరికి కూడా క్రెడిట్ కార్డు అందిస్తారు. దీనినే యాడ్-ఆన్ కార్డు అంటారు. అలాగే, దరఖాస్తు దారుని స్థోమతను బట్టి జాయింట్ క్రెడిట్ కార్డును కూడా జారీ చేస్తారు.

Read more:

PMJDY : మీకు జన్-ధన్ యోజన ఖాతా ఉందా.. అయితే రూ. 10,000 మీవే!

Advertisement

Next Story