- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
18.5 శాతం పెరిగిన HDFC బ్యాంక్ నికర లాభం
ముంబై: దేశీయ ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం సంవత్సరానికి 18.5 శాతం పెరిగి రూ.12,259 కోట్లకు చేరుకున్నట్లు శనివారం ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 10,342 కోట్లుగా ఉంది. అలాగే, త్రైమాసికంలో ప్రధాన ఆదాయం సంవత్సరానికి దాదాపు 25% పెరిగి రూ.22,988 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయంలో బలమైన వృద్ధి, తక్కువ కేటాయింపుల కారణంగా బ్యాంకు లాభాలు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
నిర్వహణ లాభం కూడా సంవత్సరానికి 13.4% పెరిగి రూ.19,024 కోట్లకు చేరుకుంది. నిర్వహణ ఖర్చులు సంవత్సరానికి 26.5% పెరిగి రూ.12,464 కోట్లకు చేరాయి, ఖర్చు-ఆదాయ నిష్పత్తి 39.6%గా ఉంది. మొత్తం రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు డిసెంబర్ 31 నాటికి 1.23%గా ఉన్నాయి, ఇది ఏడాది క్రితం 1.26%గా ఉంది.
బ్యాంకు స్థూల నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ రేషియో 1.23 శాతం, నికర NPA నిష్పత్తి 0.33 శాతం వద్ద ఉంది. త్రైమాసికంలో కేటాయింపులు రూ. 2,806 కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం రూ. 2,994 కోట్లతో పోలిస్తే ఇది 6.3 శాతం క్షిణించింది. మొత్తం డిపాజిట్లు 19.9 శాతం పెరిగి రూ.17.33 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
- Tags
- HDFC