లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన రుణరేట్లు!

by samatah |   ( Updated:2023-03-06 03:39:19.0  )
లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన రుణరేట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ : లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త. ఎప్పుడెప్పుడు మన సొంత ఇంటి కలను సాకారం చేసుకుందామా.. అని ఎదురు చూస్తున్న వారికి బ్యాంకు తీపి కబురు అందించింది.

ప్రస్తతం ఆర్‌బీఐ రెపోరేటు పెంచడంతో బ్యాంకులన్నీ రుణ రేట్లు పెంచుకుంటూ పోతున్నాయి. కానీ ఓ బ్యాంకు మాత్రం లోన్స్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ అందిస్తూ.. రుణ రేట్లను భారీగా తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ బరోడో హోమ్ లోన్స్‌పై ఏకంగా 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 8.5 నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే ఎంఎస్ఎంఈ రుణాలపై కూడా రేట్లు తగ్గించడంతో అవి 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతాయి. క్రెడిట్ స్కోర్ 751 లేదా అంత కన్నా ఎక్కువగా ఉంటేనే ఈ తక్కువ వడ్డీ రేటు బెనిఫిట్ లభిస్తుంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, బ్యాంక్ ఆఫ్ బరోడో ఈ ఆఫర్‌ను మార్చి 5 నుంచి అమలులోకి తీసుకరాగా, ఈ నెల చివరి వరకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది.అందువలన ఎవరైతే తన డ్రీమ్ హౌస్‌‌ను నిర్మించుకుందాం అనుకుంటున్నారో వారు ఈ నెల చివరిలోపు లోన్ తీసకోవడం ద్వారా కలిసి వస్తుందని చెప్పవచ్చు.

Advertisement

Next Story