SBI తర్వాత అరుదైన ఘనతను దక్కించుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా!

by Harish |   ( Updated:2023-06-19 12:29:33.0  )
SBI తర్వాత అరుదైన ఘనతను దక్కించుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా!
X

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) అరుదైన ఘనతను సాధించింది. దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తర్వాత మార్కెట్ విలువ రూ. లక్షల కోట్లకు చేరిన రెండో ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలిచింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో బీఓబీ షేర్ ధర 3 శాతానికి పైగా పుంజుకుని కొత్త గరిష్ఠం రూ. 194.15 వద్ద ముగిసింది. గడిచిన ఏడాది కాలంలో బ్యాంక్ షేర్ ధర రూ. 96 నుంచి రూ. 194కి చేరుకుని మల్టీ బ్యాగర్‌గా మారింది. అంతేకాకుండా 2019లో దేనా బ్యాంక్, విజయ బ్యాంకులను విలీనం చేసుకున్న తర్వాత బ్యాంక్ షేర్ ధర ర్యాలీ కొనసాగించడం గమనార్హం.

ప్రస్తుతం ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ రూ. 5.07 లక్షల కోట్లతో ప్రభుత్వ రంగ బ్యాంకుల విభాగంలో అగ్రస్థానంలో ఉంది. భారత కంపెనీల జాబితాలో రిలయన్స్ సంస్థ రూ. 17.29 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో అతిపెద్ద సంస్థగా ఉంది. టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, ఇన్ఫోసిస్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది.

Also Read...

60 ఏళ్లు దాటిన రైతులకు ప్రతినెలా రూ. 3000 పెన్షన్!

Advertisement

Next Story

Most Viewed