త్వరలో క్రెడిట్ కార్డు విడుదల చేయనున్న బంధన్ బ్యాంక్

by S Gopi |
త్వరలో క్రెడిట్ కార్డు విడుదల చేయనున్న బంధన్ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ బంధన్ బ్యాంక్ త్వరలో క్రెడిట్ కార్డ్ మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. ఈ ఏడాది ఏప్రిల్-మేలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవలే బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ పీయూష్ ఝా బంధన్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూనిట్‌కి హెడ్‌గా నియమించింది. మరో ఏడాదిలో బ్యాంకింగ్ కార్యకలాపాల్లో 10 ఏళ్లు పూర్తి చేసుకోనున్న బంధన్ బ్యాంక్ కొత్తగా క్రెడిట్ కార్డును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. 2015లో బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. 2024, జనవరి నాటికి మొత్తం 9.95 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డేటా చెబుతోంది. ఈ మార్కెట్లో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దాదాపు 20 శాతం వాటాతో అగ్రగామిగా ఉంది. ఇప్పటికే క్రెడిట్ కార్డుల కోసం బంధన్ బ్యాంక్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)కి చెందిన రూపే కార్డుతో పాటు వీసా, మాస్టర్ కార్డు నెట్‌వర్క్‌లతో ఒప్పందం కోసం చర్చలు నిర్వహిస్తోంది. క్రెడిట్ కార్డు కస్టమర్లకు పేపర్‌లెస్ రూపంలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story