22 శాతం పెరిగిన బంధన్ బ్యాంకు రుణాలు, అడ్వాన్సులు

by Harish |   ( Updated:2022-10-08 16:50:07.0  )
22 శాతం పెరిగిన బంధన్ బ్యాంకు రుణాలు, అడ్వాన్సులు
X

కోల్‌కతా: ప్రైవేట్ రంగ రుణదాత బంధన్ బ్యాంక్ రుణాలు, అడ్వాన్స్‌లు 2022 సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి 22% పెరిగి రూ. 99,374 కోట్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో లోన్స్, అడ్వాన్సులు రూ. 81,661 కోట్లుగా ఉన్నాయి. 2022 సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 21% వృద్ధి చెంది రూ. 99,365 కోట్లకు చేరాయి. ఇది ఏడాది క్రితం రూ. 81,898 కోట్లుగా ఉంది. దీనిలో రిటైల్ డిపాజిట్లు 7% పెరుగుదలతో ఏడాది క్రితం రూ. 68,787 కోట్ల నుంచి ప్రస్తుతం రూ. 73,660 కోట్లకు చేరాయి. రిటైల్ డిపాజిట్‌లో రూ. 40,509 కోట్ల కరెంట్ ఖాతా, సేవింగ్స్ ఖాతా (CASA) ఉన్నాయి.

మొత్తం ఆదాయం రూ. 2,731 కోట్ల నుంచి రూ. 2,844.1 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ. 2,114.1 కోట్ల నుంచి రూ. 2,514.4 కోట్లకు పెరిగిందని బ్యాంక్ తెలిపింది. బంధన్ బ్యాంక్ MD అండ్ CEO చంద్ర శేఖర్ ఘోష్ మాట్లాడుతూ, బ్యాంక్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరో 551 శాఖలను ప్రారంభించనుందని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో పంపిణీని మరింత పటిష్టంగా చేయడానికి దృష్టి సారించిందని అన్నారు. కొత్త బ్రాంచ్‌ల కలయికతో బ్యాంక్ శాఖల సంఖ్య 6,000 దాటనుంది.

ఐటీలో తగ్గుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకం

Advertisement

Next Story