ఐఫోన్లు వాడటంపై బ్యాన్.. ఆ దేశం సంచలన నిర్ణయం

by Javid Pasha |   ( Updated:2023-09-07 06:20:07.0  )
ఐఫోన్లు వాడటంపై బ్యాన్.. ఆ దేశం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఐఫోన్లు వాడటంపై పలు ఆంక్షలు విధించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీస్ పనుల కోసం ఐఫోన్ వాడటంపై బ్యాన్ విధించింది. ఆఫీస్ పనుల కోసం ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఐఫోన్లు వాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఐఫోన్లతో పాటు ఇతర ఇదేశీ బ్రాండ్లను ఆఫీస్ పనుల కోసం ఉపయోగించవద్దని, అంతేకాకుండా ఆఫీసులకు కూడా తీసుకురావొద్దంటూ నిషేధం అమల్లోకి తెచ్చింది.

వచ్చే వారంలో యాపిల్ ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా కొత్త ఐఫోన్లను విడుదల చేసేందుకు సిద్దమవుతున్న తరుణంలో.. చైనా ఆంక్షలు అమల్లోకి తీసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా పరమైన కారణాల వల్ల చైనా ఐఫోన్లపై ఆంక్షలు విధించినట్లు చెబుతున్నారు. అయితే అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్దంతో భాగంగానే చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవల చైనాకు చెందిన టిక్‌టాక్, హవాయి ఫోన్లపై అమెరికా నిషేధం విధించింది.

ఈ క్రమంలోనే ఐఫోన్ల వాడకంపై చైనా ఆంక్షలు విధిస్తున్నట్లు చెబుతున్నారు. చైనాలో యాపిల్ ఐఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇలాంటి ఆంక్షలు విధించడం వల్ల ఐఫోన్ల వినియోగం తగ్గే అవకాశముందని, దీని వల్ల యాపిల్ కంపెనీకి నష్టం జరుగుతుందని అంటున్నారు. ఇప్పటివరకు చైనా నిర్ణయంపై ఇంకా యాపిల్ కంపెనీ స్పందించలేదు. మరికొంతమంది మాత్రం స్వదేశీ బ్రాండ్స్‌ను ప్రోత్సహించేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకునున్నట్లు చెబుతున్నారు.

కాగా ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసేందుకు యాపిల్ కంపెనీ సిద్దమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని లాంచ్ చేయనుంది. ఈ క్రమంలో చైనా నిర్ణయం యాపిల్ వర్గాలను షాక్‌కు గురి చేసిందని చెప్పవచ్చు

Advertisement

Next Story