రైతుల రుణాల కోసం ఐటీసీ తో యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యం!

by Harish |
రైతుల రుణాల కోసం ఐటీసీ తో యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యం!
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తన సేవల విస్తరణ కోసం ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ తో భాగస్వామ్యం చేసుకున్నట్టు గురువారం ప్రకటనలో వెల్లడించింది. అందులో భాగంగా ఐటీసీ అగ్రి ఎకోసిస్టమ్‌లో భాగమైన రైతులకు బ్యాంకు రుణాలు, ఇతర సేవలను అందించేందుకు వీలవుతుంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా యాక్సిస్ బ్యాంకు సేవలు రైతులకు లభిస్తాయని, వారి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఈ ఒప్పందం ఎంతో దోహదపడుతుందని బ్యాంకు తెలిపింది.

ముఖ్యంగా రైతు రుణాలు, బంగారు రుణాల వంటి సౌకర్యాలను రైతులకు కల్పించనున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా బ్యాంకుకు చెందిన 656 జిల్లాల్లోని గ్రామీణ-పట్టణ, సెమీ అర్బన్ బ్రాంచుల నుంచి రైతులకు బ్యాంకింగ్ సేవలు లభిస్తాయి. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు కొత్త అకౌంట్ల వృద్ధిని పెంచుకోవడం ద్వారా దేశ బ్యాంకింగ్ రంగంలో మరిన్ని లక్ష్యాలను సాధించాలని భావిస్తోంది. గతేడాది ఆఖరు నాటికి బ్యాంకు గ్రామీణ మార్కెట్లో రుణాల పంపిణీ 12 శాతం, డిపాజిట్లు 16 శాతం పెరిగాయని పేర్కొంది.

Advertisement

Next Story