- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలోనే మొట్టమొదటి నంబర్‌లెస్ క్రెడిట్ కార్డు విడుదల చేసిన యాక్సిస్ బ్యాంక్!
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ దేశంలోనే తొలిసారిగా నంబర్‌లెస్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. దీనికోసం ఫిన్‌టెక్ కంపెనీ ఫైబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సాధారణంగా క్రెడిట్ కార్డులపై 16 అంకెల నంబర్, కార్డు దారు పేరు, సీవీవీ వంటి వివరాలు ఉంటాయి. కానీ, యాక్సిస్ బ్యాంక్-ఫైబ్ క్రెడిట్ కార్డుపై ఖాతాదారులకు సంబంధించిన ఎలాంటి వివరాలు ఉండవు. నంబర్‌లెస్ క్రెడిట్ కార్డుపై కేవలం చిప్ మాత్రమే ఉంటుంది. సంబంధిత కార్డు వివరాల కోసం ఫైబ్ మొబైల్ యాప్‌లో ఉంటాయి.
దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రకమైన నంబర్‌లెస్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చామని యాక్సిస్ బ్యాంక్ కార్డ్ అండ్ పేమెంట్ హెడ్ సంజీవ్ మోఘె అన్నారు. కొత్తగా తీసుకొచ్చిన నంబర్‌లెస్ క్రెడిట్ కార్డు ద్వారా వినియోగదారులు ఆన్‌లైన్ టికెట్, ఫుడ్ డెలివరీ, క్యాబ్ సేవల కోసం 3 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందుతారు.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లావాదేవీలకు 1 శాతం క్యాష్‌బ్యాక్ ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది. యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి భారత మొట్టమొదటి నంబర్‌లెస్ క్రెడిట్ కార్డును తీసుకురావడం సంతోషంగా ఉందని ఫైబ్ సహ-వ్యవస్థాపకుడు, ఛేఓ అక్షయ్ మెహ్రోత్రా అన్నారు.