ఎఫ్‌డీలపై వడ్డీ రేటు పెంచిన యాక్సిస్ బ్యాంక్!

by Harish |   ( Updated:2023-03-10 16:03:30.0  )
ఎఫ్‌డీలపై వడ్డీ రేటు పెంచిన యాక్సిస్ బ్యాంక్!
X

ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీని 40 బేసిస్ పాయింట్లు పెంచుతూ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన కాలపరిమితులపై వడ్డీ రేట్లలో మార్పులు చేసినట్లు, సవరించిన రేట్లు మార్చి 10వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

బ్యాంకు అధికారిక వివరాల ప్రకారం, సాధారణ ఖాతాదారులకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధిపై వడ్డీని 3.50 శాతం నుంచి గరిష్ఠంగా 7.26 శాతం వరకు వడ్డీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గరిష్ట వడ్డీ 2 ఏళ్ల నుంచి 30 నెలల మధ్య కాలపరిమితిపై 7.26 శాతం వడ్డీ లభిస్తుందని, ఏడాది నుంచి ఏడాది పైన 24 రోజుల డిపాజిట్లకు 6.75 శాతం, ఏడాది పైన 24 రోజుల నుంచి 13 నెలల వరకు 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. 13 నెలల నుంచి 2 ఏళ్ల మధ్య డిపాజిట్లకు 7.15 శాతం, 30 నెలల నుంచి 10 ఏళ్ల మధ్య ఎఫ్‌డీలకు 7 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు బ్యాంకు పేర్కొంది.

Advertisement

Next Story