August 22 Gold Price : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు

by Kavitha |   ( Updated:2024-08-22 06:26:16.0  )
August 22 Gold Price : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు
X

దిశ, ఫీచర్స్: బంగారం ధరలు గత కొద్ది కాలం నుంచి తగ్గుతూ, పెరుగుతూ కొనుగోలు దారులను టెన్షన్ పెట్టిస్తున్నాయి. అయితే మహిళలు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొంటుంటారు. రేట్లు పెరుగుతుండటంతో అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో శుభకార్యాలు మొదలైపోయాయి. పెళ్లిళ్లు జరుగుతుండటంతో బంగారం రేట్లలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

నిన్నటి ధరలతో పోల్చుకుంటే.. నేడు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 పెరగ్గా రూ. 67, 110కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 10 పెరగడంతో రూ. 73, 210గా విక్రయిస్తున్నారు. ఇక కిలో వెండి ధరల విషయానికొస్తే.. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ. 91, 900గా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 67, 110

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 73, 210

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 67, 110

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 73, 210

Advertisement

Next Story

Most Viewed