- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏడాది చివర్లోగా 2,500 ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ల ఏర్పాటు: ఏథర్ ఎనర్జీ!
బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు గురువారం ప్రకటించింది. వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 2,500 ఛార్జింగ్ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతానికి దేశంలోని 80 నగరాల్లో కంపెనీకి వెయ్యికి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి.
ఇప్పటివరకు దేశంలో ద్విచక్ర ఈవీల కోసం అతిపెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నామని, ముఖ్యంగా టైర్2, టైర్3 నగరాల్లో 60 శాతం ఛార్జింగ్ స్టేషన్లు ఇన్‌స్టాల్ చేశామని కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు ఛార్జింగ్ సదుపాయాలను పెంచడం ఎంతో కీలకం. దేశీయంగా పటిష్టమైన ఈవీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంపై తాము దృష్టి సారించాం. ఇప్పటికే అతిపెద్ద పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం భారీగా పెట్టుబడులు పెట్టామని ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ చెప్పారు.
కంపెనీ ఛార్జింగ్ సౌకర్యాలను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. ప్రజలకు అందుబాటులోనే ఛార్జింగ్ సదుపాయాలు లభించేలా అపార్ట్‌మెంట్, ఆఫీస్, టెక్ పార్క్ ఉండే ప్రాంతాల్లో వీటి ఏర్పాటు ఉంటుందని రవ్‌నీత్ పేర్కొన్నారు. కాగా, దిగ్గజ ఈవీ సంస్థ హీరో మోటోకార్ప్ మద్దతున్న ఏథర్ ఎనర్జీ గత నెలలో 12,419 యూనిట్లను డెలివరీ చేసింది.