- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మొదటి బుల్లెట్ రైలు స్టార్ట్ అయ్యేది అప్పుడే
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో మొదటి బుల్లెట్ రైలు 2026లో ప్రారంభమవుతుందని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య మొత్తం 508.17 కి.మీ మేర ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. మొదటగా సూరత్ నుంచి బిలిమోరా వరకు రైలును ప్రారంభిస్తాం, 2028 నాటికి పూర్తిగా ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తుందని రైజింగ్ భారత్ సమ్మిట్ 2024లో మంత్రి వైష్ణవ్ అన్నారు. హై-స్పీడ్ రైలు మార్గాన్ని జపాన్‌కు చెందిన షింకన్‌సెన్ సాంకేతికతను ఉపయోగించి నిర్మిస్తున్నారు. దీని మొత్తం వ్యయం రూ.1.10 లక్షల కోట్లుగా అంచనా. ముంబై, థానే, వాపి, సూరత్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్ వంటి పెద్ద ఆర్థిక కేంద్రాలను బుల్లెట్ రైలు కారిడార్ అనుసంధానం చేస్తుందని, ఇది దేశ ఆర్థిక వృద్ధికి మంచిదని అశ్విని వైష్ణవ్ అన్నారు.
అలాగే, సెమీకండక్టర్ల గురించి మాట్లాడిన ఆయన డిసెంబరు నాటికి మేడ్-ఇన్-ఇండియా చిప్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. ఇటీవల, కేంద్ర మంత్రివర్గం రూ. 1.26 లక్షల కోట్ల అంచనా వ్యయంతో గుజరాత్‌లో రెండు, అస్సాంలో మూడు సెమీకండక్టర్ ప్లాంట్ ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ ప్లాంట్లు US ఆధారిత మెమరీ చిప్ తయారీ సంస్థ మైక్రోన్ ఏర్పాటు చేస్తున్న రూ. 22,516 కోట్ల చిప్ అసెంబ్లీ ప్లాంట్‌కు అదనంగా వస్తున్నాయి.