- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్‌బీఐ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అర్నాబ్ కుమార్ చౌదరి
దిశ, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అర్నాబ్ కుమార్ చౌదరిని నియమించారు. ఈ విషయాన్ని ఆర్‌బీఐ జూలై 1న ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన నియామకం జూన్ 3, 2024 నుండి అమల్లోకి వస్తుంది. అర్నాబ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ డిపార్ట్‌మెంట్, ఇంటర్నేషనల్ డిపార్ట్‌మెంట్‌లను చూస్తారని ఆర్‌బీఐ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందకముందు అర్నాబ్ ఆర్‌బీఐ పర్యవేక్షణ విభాగంలో చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ఆయనకు ఆర్థిక సంస్థల పర్యవేక్షణలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఇంకా, బడ్జెట్, అకౌంటింగ్, కార్పొరేట్ వ్యూహలు, ఇష్యూ డిపార్ట్‌మెంట్‌లు, అనేక కమిటీలు, వర్కింగ్ గ్రూపులలో సభ్యునిగా, విధాన రూపకల్పనలో సహాయకారిగా కూడా పనిచేశారు. చౌదరి ఒక చార్టర్డ్ అకౌంటెంట్, అలాగే ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని చేశారు.