సామాన్యులకు ఆయిల్ కంపెనీల శుభవార్త.. తగ్గిన గ్యాస్ ధరలు

by sudharani |   ( Updated:2023-04-01 03:13:41.0  )
సామాన్యులకు ఆయిల్ కంపెనీల శుభవార్త.. తగ్గిన గ్యాస్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన ఎల్​పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెలా 1వ తేదీన సవరిస్తుంటారు. ఈ మేరకు ఏప్రిల్ నెలలో సామాన్య ప్రజలకు ఆయిల్ కంపెనీలు శుభవార్త అందించింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 91.50 తగ్గించింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,233కు చేరింది. గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తు్న్నాయి.

Advertisement

Next Story