మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు

by Harish |   ( Updated:2023-02-04 08:57:59.0  )
మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు
X

న్యూఢిల్లీ: ఇప్పటికే దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో మరో పిడుగులాంటి వార్త.. అమూల్ పాల ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పాలపై రూ. 3 లను పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ పేరుతో దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఒక ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ఈ ధరలు శుక్రవారం (ఫిబ్రవరి 3) నుంచే అమలులోకి వచ్చాయి. పెరిగిన ధరల ప్రకారం.. అమూల్ గోల్డ్ లీటర్ ధర రూ. 66, అమూల్ తాజా లీటర్ ధర రూ. 54, అమూల్ ఆవు పాలు లీటర్ ధర రూ. 56, అమూల్ ఏ2 గేదె పాలు లీటర్ ధర రూ. 70.

సంస్థ, చివరగా గత ఏడాది 2023, అక్టోబర్‌లో లీటర్ పాలపై రూ. 2 ధర పెంచింది. పాల ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల పాల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే పశువుల దాణా ఖర్చు దాదాపు 20 శాతానికి పైగా పెరిగిందని, ముడి సరుకుల ఖర్చు, ఇతర వ్యయాల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.

ఇవి కూడా చదవండి : పాల ధరలను లీటరుకు రూ.3 పెంచిన ప్రభుత్వం..!

Advertisement

Next Story

Most Viewed