వేసవిలో విద్యుత్ డిమాండ్‌కు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి: ప్రభుత్వ ఉన్నతాధికారి

by Harish |
వేసవిలో విద్యుత్ డిమాండ్‌కు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి: ప్రభుత్వ ఉన్నతాధికారి
X

దిశ, బిజినెస్ బ్యూరో: రాబోయే వేసవిలో దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ మేరకు విద్యుత్ ప్లాంట్‌లలో సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా తెలిపారు. ప్రముఖ మీడియాతో మాట్లాడిన ఆయన గత సంవత్సరం క్షీణతకు భిన్నంగా, వేసవి, వర్షాకాలంలో కూడా ప్లాంట్లలో బొగ్గు నిల్వలను సరిపడా ఉంచుతున్నామని అన్నారు. గత ఏడాది 125 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు నిల్వలు ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 155 మిలియన్ టన్నులకు చేరుకుంటాయని తెలిపారు.

నవంబర్ నుండి థర్మల్ ప్లాంట్‌లలో బొగ్గు నిల్వలు వేగంగా పెరిగాయి. ఫిబ్రవరి ద్వితీయార్థంలో రోజువారీ బొగ్గు నిల్వలు 1,94,000 టన్నులు కాగా, ఇది గత ఏడాది ఇదే కాలంలో 26,000 టన్నులుగా ఉందని అమృత్ లాల్ పేర్కొన్నారు. గత ఏడాది మార్చిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో బొగ్గు నిల్వ క్షీణత కనిపించింది. కానీ ఈ సంవత్సరం, ఇది రోజుకు 2,00,000 టన్నులు పెరిగిందని తెలిపారు. ఉత్పత్తి, రవాణా రెండు కూడా గణనీయంగా పెరిగింది. కాబట్టి ప్రస్తుత ఏప్రిల్, మే, జూన్‌లలో క్షీణతకు పెద్దగా అవకాశం లేదని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed