భారత్ నుంచి అమెజాన్ ఎగుమతుల్లో 60 శాతం వృద్ధి!

by Javid Pasha |
భారత్ నుంచి అమెజాన్ ఎగుమతుల్లో 60 శాతం వృద్ధి!
X

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ఈ ఏడాది ఆఖరు నాటికి భారత్ నుంచి సుమారు రూ. 69 వేల కోట్ల విలువైన ఎగుమతులు నిర్వహించనున్నట్టు బుధవారం ప్రకటనలో తెలిపింది. ఇది గతేడాది జరిగిన రూ. 41.14 వేల కోట్ల కంటే 60 శాతం అధికమని కంపెనీ తన వార్షిక ఎక్స్‌పోర్ట్ డైజెస్ట్ నివేదికలో వెల్లడించింది. ఇది కంపెనీ 2015లో నిర్దేశించిన అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్ కింద 2025 నాటికి రూ. 1.65 లక్షల కోట్ల లక్ష్యాన్ని అనుగుణంగా ఉందని అమెజాన్ ఇండియా అభిప్రాయపడింది. మొత్తం ఎగుమతుల్లో ఇప్పటికే 1,200 మందికి పైగా భారతీయ ఎగుమతి వ్యాపారులు రూ. కోటి టర్నోవర్‌ను అధిగమించారు.

భారత్ నుంచి 18 అంతర్జాతీయ మార్కెట్లకు 26.6 కోట్ల ఉత్పత్తులు విక్రయించబడుతున్నాయి. అవి యూఎస్, యూకే, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ దేశాలకు అత్యధికంగా భారత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మొత్తం ఎగుమతుల్లో బొమ్మల విభాగం గతేడాది కంటే అధికంగ 50 శాతం ఎక్కువ ఎగుమతి జరగ్గా, వాటి తర్వాత వంటగది సామగ్రి 35 శాత, బ్యూటీ 25 శాతం, ఇతర ఉత్పత్తులు 20 శాతం వృద్ధి చెందాయని అమెజాన్ ఇండియా పేర్కొంది.

Advertisement

Next Story