- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amazon launches Prime Lite plan in India : 'ప్రైమ్ లైట్' మెంబర్‌షిప్ ప్లాన్ తెచ్చిన అమెజాన్ ఇండియా!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ఇటీవల తన అమెజాన్ ప్రైమ్ లైట్ పేరుతో కొత్త మెంబర్‌షిప్ ప్లాన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందించిన ఈ ప్లాన్ తాజాగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణ ప్రైమ్ మెంబర్‌షిప్ కంటే ప్రైమ్ లైట్ సరసమైన ధరలతో ఎక్కువ మంది వినియోగదారులకు చేరువ అవుతుందని కంపెనీ భావిస్తోంది. ధరల పరంగా చూస్తే అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ప్లాన్ 12 నెలల సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 999 గా ఉంది. ఇది ఒకే ప్లాన్‌గా లభిస్తుంది, నెలవారీ, త్రైమాసిక ఎంపికల్లో ఉండదు.
అదే సాధారణ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్ ఏడాదికి రూ. 1,499గా ఉంది. అంతేకాకుండా ప్రైమ్ లైట్ ద్వారా కొన్ని వస్తువులను ఉచితంగా రెండు రోజుల్లో డెలివరీ పొందవచ్చు. అదనంగా కొన్ని ప్రాంతాలకు నో-రష్ షిప్పింగ్ సౌకర్యాన్ని ఎంచుకునే అవకాశంతో పాటు రూ. 25 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అమెజాన్ ఇస్తోంది. అలాగే, అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంటుంది. ప్రైమ్ లైట్ సబ్‌స్క్రైబర్లు ప్రైమ్ వీడియోలో యాడ్‌లతో కూడిన హెచ్‌డీ నాణ్యతతో రెండు పరికరాల్లో వినియోగించవచ్చని అమెజాన్ ఇండియా పేర్కొంది.
Read more: