ALTT OTT: ఆల్ట్ ఓటీటీ పోక్సో, ఐటీ చ‌ట్టాల్ని ఉల్లంఘిస్తోంది.. ముంబై పోలీసులకు స‌మాచార మాజీ క‌మిష‌న‌ర్ ఫిర్యాదు

by Maddikunta Saikiran |
ALTT OTT: ఆల్ట్ ఓటీటీ పోక్సో, ఐటీ చ‌ట్టాల్ని ఉల్లంఘిస్తోంది.. ముంబై పోలీసులకు స‌మాచార మాజీ క‌మిష‌న‌ర్ ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓటీటీల పుణ్యమా అని థియేటర్ల(Theatres)లో విడుదలైన సినిమాలన్నీ నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుండంతో సినిమా లవర్స్ దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదని ఓటీటీలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా త్వరగా సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ సినిమాల్లో కూడా అనేర రకాల జోనర్లు ఉంటాయి. అయితే దీనిని అదును చేసుకొని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్(OTT Platforms) బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను కూడా మితిమీరి స్ట్రీమింగ్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌(Ekta Kapoor) కు చెందిన ఆల్ట్ ఓటీటీ(ALTT OTT)పై కేసు నమోదైంది. సదరు OTT అస‌భ్య‌క‌ర కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చి పోక్సో, ఐటీ చ‌ట్టాల్ని(POCSO, IT Acts) ఉల్లంఘిస్తోందని స‌మాచార మాజీ క‌మిష‌న‌ర్(Former Information Commissioner) ఉద‌య్ మ‌హుర్క‌ర్(Uday Mahurkar) ఆధ్వ‌ర్యంలోని సేవ్ క‌ల్చ‌ర్‌-సేవ్ భార‌త్ ఫౌండేష‌న్‌(Save Culture-Save Bharat Foundation) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక‌-అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్ అందుబాటులో ఉండడమే దేశంలో అత్యాచారాల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఉద‌య్ పేర్కొన్నారు. కాగా ఇటీవలే ఏక్తా కపూర్‌పై ఓటీటీ ఆల్ట్‌ బాలాజీలో ప్రసారమవుతోన్న 'గంధీ బాత్‌ సీజన్‌-6'(Gandhi Bath Season-6)' సిరీస్ కు సంబంధించి పోక్సో కేసు నమోదైంది. ఈ సిరీస్ లో మైనర్లకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలను చూపించారన్న ఫిర్యాదుతో ఏక్తా కపూర్‌ తో పాటు ఆమె తల్లి శోభా కపూర్‌పై ముంబై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story