HDFC ఖాతాదారులకు అలర్ట్: నేడు మీ యూపీఐ సేవలు పని చేయడం లేదా? కారణం ఇదే!

by Jakkula Samataha |   ( Updated:2024-07-13 10:55:17.0  )
HDFC ఖాతాదారులకు అలర్ట్: నేడు మీ యూపీఐ సేవలు పని చేయడం లేదా? కారణం ఇదే!
X

దిశ, ఫీచర్స్ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులకు మఖ్య గమనిక. సిస్టెమ్​ అప్​గ్రేడ్​ నేపథ్యంలో నేడు బ్యాంకుకు సంబంధించిన పలు కీలక సేవలు నిలిచినపోనున్నాయని, ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందకూడదని సూచించింది. ఇప్పటికే చాలా మంది నగదు లావాదేవీలు జరగకపోవడం, నెట్ బ్యాంకింగ్ పని చేయకపోవడంతో కాస్త టెన్షన్‌కు గురి అయ్యారు.

అయితే హెచ్ డీఎఫ్‌సీ బ్యాంకు, యూజర్​ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి తన కోర్ బ్యాంకింగ్ సిస్టెమ్‌ను కొత్త ఇంజినీరింగ్ ప్లాట్​ఫామ్‌కు​ బదిలీ చేస్తోంది. పనితీరు మెరుగుపరచడం, విశ్వసనీయత, అధిక ట్రాఫిక్ పరిమాణాలను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచడం, ,స్కేలబిలిటీని పెంచడం దీని లక్ష్యం అని ఓ రుణదాత ప్రకటనలో తెలియజేశారు

దీని వలన చాలా వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఈరోజు ఉదయం 3 గంటల నుంచి సాయంత్ర 4.30 నిమిషాల వరకు పని చేయవని తెలిపింది. అలాగే డెబిట్, క్రెడిట్ కార్డుల ఏదైనా ఏటీఎం నుంచి పరిమిత మొత్తంలో డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అయితే కార్డ్ మేనేజ్ మెంట్ కార్యాకాలపాలు మాత్రం కొనసాగుతాయిని తెలిపింది. అంతే కాకుండా డీమ్యాట్, కార్డు రుణాలను వీక్షించడం వంటి పలు రకాల సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అయితే బ్యాంకు ఖాతాదారులు ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఈరోజు సాయంత్ర 4.30 నిమిషాల తర్వాత చాలా వరకు సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

నోట్ : ఇది ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు.

Advertisement

Next Story

Most Viewed