- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్లోబల్ స్నాక్ బ్రాండ్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసిన రిలయన్స్!
న్యూఢిల్లీ: రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కు చెందిన ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్(ఆర్‌సీపీఎల్) గ్లోబల్ కార్న్ చిప్స్ స్నాక్స్ బ్రాండ్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ జనరల్ మిల్స్‌కు చెందిన స్నాక్స్ బ్రాండ్ అలన్స్ బగల్స్‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం ఈ బ్రాండ్ యూకే, యూఎస్, మిడిల్ ఈస్ట్ సహా ప్రధాన గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఇరిజినల్(సాల్టెడ్), టొమాటో, చీజ్ వంటి ఫ్లేవర్లలో ఈ స్నాక్ లభిస్తుందని, వాటి ధర రూ. 10 నుంచి ప్రారంభమవుతుందని రిలయన్స్ కన్స్యూమర్ వెల్లడించింది. అలన్స్ బగల్స్ ప్రస్తుతం కేరళలో ప్రవేశపెట్టామని, క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
ఆర్‌సీపీఎల్ ఇప్పటికే తన ఎఫ్ఎంసీజీ పోర్ట్‌ఫోలియోలో కాంపా కోలా, మలిబన్ గ్లిమ్మర్, డోజో సహా పలు బ్రాండ్లను కలిగి ఉంది. దేశీయంగా ఎఫ్ఎంసీజీ రంగం క్రమంగా వృద్ధి చెందుతోంది. దేశీయ మార్కెట్లో విదేశీ ఉత్పత్తులను తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నాం. ప్రస్తుతం బగల్స్ స్నాక్ బ్రాండ్‌ను తీసుకురావడం సంతోషంగా ఉంది. దీని ద్వారా ఎఫ్ఎంసీజీ రంగంలో మరింత వేగంగా విస్తరిస్తామని ఆర్‌సీపీఎల్ ప్రతినిధి చెప్పారు.
జనరల్ మిల్స్ అంతర్జాతీయంగా అత్యంత ఆదరణ కలిగిన బ్రాండ్లలో ఒకటిగా ఉంది. ఇప్పుడు భారత మార్కెట్లోకి ప్రవేశించడం సంతోషంగా ఉందని జనరల్ మిల్స్ ఇండియా ఫైనాన్స్ డైరెక్టర్ శేషాద్రి సవాల్గి పేర్కొన్నారు.