- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
5G Network: 5జీ పరికరాల కోసం భారీ పెట్టుబడికి సిద్ధమవుతున్న జియో, ఎయిర్‌టెల్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ సేవలు ప్రారంభమై చాలాకాలమే అయినప్పటికీ పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి రాలేదు. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు 5జీ సేవలందించడంతో ముందంజలో ఉండగా, త్వరలో వోడాఫోన్ ఐడియా కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఆలస్యమైనప్పటికీ ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సైతం శుక్రవారం తన 5జీ నెట్‌వర్క్‌పై వీడియో కాల్ ద్వారా పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో 5జీ నెట్‌వర్క్‌పై పట్టు సాధించేందుకు జియో, ఎయిర్‌టెల్ సిద్ధమవుతున్నాయి. తాజాగా ఈ రెండు కంపెనీలు తమ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కవరేజీని విస్తరించేందుకు 2 బిలియన్ డాలర్ల(రూ. 16.7 వేల కోట్ల) విలువైన 5జీ నెట్‌వర్క్ గేర్‌ను కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. సునీత్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్‌టెల్ తన రెండో రౌండ్ 5జీ పరికరాల కొనుగోళ్ల కోసం ప్రతిపాదించినట్టు సమాచారం. జియో సైతం తన గ్లోబల్ భాగస్వాములతో చర్చలు జరుపుతోంది.