Freedom Sale: విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. టికెట్ ధర రూ.1,947

by Harish |   ( Updated:2024-08-01 10:12:46.0  )
Freedom Sale: విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. టికెట్ ధర రూ.1,947
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. "ఫ్రీడమ్ సేల్" క్రింద రూ.1947 లకే విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఆగస్టు 5 వరకు బుకింగ్‌ల కోసం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న వారు దేశీయ, అంతర్జాతీయ రూట్లలో సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించడానికి అవకాశం ఉంది. ఢిల్లీ-జైపూర్, బెంగళూరు-గోవా, ఢిల్లీ-గ్వాలియర్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలతో పాటు దేశీయంగా 32 రూట్లు, అంతర్జాతీయంగా 15 రూట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుంది.

విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, SMEలు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సభ్యులు (వారిపై ఆధారపడిన వారు) ప్రత్యేక తగ్గింపు ధరలను పొందవచ్చు. airindiaexpress.com ద్వారా బుకింగ్ చేసే వారు ప్రత్యేకంగా జీరో-చెక్-ఇన్ బ్యాగేజీ ఎక్స్‌ప్రెస్ లైట్ చార్జీలకు కూడా యాక్సెస్ పొందవచ్చు. ఎక్స్‌ప్రెస్ లైట్ చార్జీలలో ఎటువంటి ఫీజు లేకుండా అదనంగా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం. చెక్-ఇన్ బ్యాగేజీకి దేశీయ విమానాల్లో 15 కిలోలకు రూ. 1,000 తగ్గింపు, అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోలకు రూ.1,300 తగ్గింపు కూడా ఉంది. ఇంకా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లాయల్టీ మెంబర్స్‌కు ప్రత్యేకమైన తగ్గింపులు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed