- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తక్కువ ధరలో పెట్రోల్, డీజిల్ విక్రయించనున్న నయారా ఎనర్జీ!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇంధన సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పోటీ పడి మరీ తగ్గిస్తున్నాయి. రిలయన్స్-బీపీ తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ చమురు సంస్థ నయారీ ఎనర్జీ కూడా ప్రభుత్వ రంగ చమురు సంస్థల ధరల కంటే రూ. 1 తక్కువకు పెట్రోల్, డీజిల్ విక్రయించనున్నట్టు వెల్లడించింది. ఇటీవల రిలయన్స్-బీపీ తన సుపీరియర్ గ్రేడ్ క్వాలిటీ డీజిల్‌ను రూ. 1 తక్కువ ధరకు విక్రయించిన నేపథ్యంలోనే నయారీ ఎనర్జీ అదే తరహా నిర్ణయం తీసుకోవడం విశేషం.
ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియంలు గత కొన్నాళ్ల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేయట్లేదు. రష్యా-ఉక్రెయిన్ వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ సంస్థలు ధరలను స్థిరంగా ఉంచుతున్నాయి. ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ గతంలో ఏర్పడిన నష్టాలను భరీ చేసే పనిలో ఉన్నాయి.
ఇదే సమయంలో ప్రైవేటు రంగ సంస్థలు నష్టాల నుంచి బయటపడేందుకు ఎక్కువ ధరకు ఇంధనాన్ని విక్రయించాయి. ఇటీవల గ్లోబల్ మార్కెట్లో ధరలు దిగి రావడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు కూడా బదిలీ చేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే నయారా ఎనర్జీ రూ. 1 తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తామని ప్రకటించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 86,925 పెట్రోల్ బంకుల్లో నయారా సంస్థకు 7 శాతం వాటా ఉంది. అందులో 78,567 బంకులు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినవి ఉన్నాయి. రిలయన్స్-బీపీకి 1,555 బంకులు ఉన్నాయి.
Also Read..