భారత ఈక్విటీల్లోకి మళ్లీ ఎఫ్‌పీఐ పెట్టుబడులు!

by Vinod kumar |   ( Updated:2023-03-12 16:35:05.0  )
భారత ఈక్విటీల్లోకి మళ్లీ ఎఫ్‌పీఐ పెట్టుబడులు!
X

ముంబై: భారత ఈక్విటీల్లో విదేశీ నిధులు ఊపందుకున్నాయి. గత కొన్ని వారాలుగా అమ్మకాలను కొనసాగించిన విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో తిరిగి కొనుగోళ్లను ప్రారంభించారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, ప్రస్తుత నెలలో ఇప్పటివరకు భారత ఈక్విటీల్లో రూ. 13,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా గతవారం హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా నష్టపోయిన అదానీ గ్రూప్ కంపెనీల్లో అమెరికాకు చెందిన జీక్యూజీ పార్ట్‌నర్స్ వాటాల కొనుగోలుతో ఎఫ్‌పీఐ వృద్ధికి కారణమైంది.

జీక్యూజీ కంపెనీ అదానీకి చెందిన నాలుగు కంపెనీల్లో రూ. 15,446 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. గత నెలలో భారత ఈక్విటీ మార్కెట్లు రూ. 5,294 కోట్లు, అంతకుముందు జనవరిలో రూ. 28,852 కోట్ల విలువైన నిధులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 11,119 కోట్ల పెట్టుబడులను పెట్టారు. గత వారాంతం అమెరికాలోని ఎస్‌వీబీ బ్యాంక్ సంక్షోభం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్న కారణంగా రానున్న రోజుల్లో ఎఫ్‌పీఐలు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు.

Also Read...

ఎస్‌వీబీ పతనం భారత బ్యాంకింగ్ వ్యవస్థను ప్రభావితం చేయదు: నిపుణులు!

Advertisement

Next Story