- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2024లో అదానీ గ్రూప్ చెల్లించాల్సిన బాండ్ల విలువ 2 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా పీకల్లోతు కష్టాల్లో పడ్డ అదానీ గ్రూప్ సమస్యలను అధిగమించే ప్రయంతాలు చేస్తోంది. అయినప్పటికీ కంపెనీల షేర్లు నెమ్మదిగానే లాభాల బాట పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపేందుకు రోడ్‌షోలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అదానీ గ్రూప్ 2024లో కంపెనీ 2 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో చెప్పుకుంటే రూ. 16.35 వేల కోట్లు) వరకు విలువైన విదేశీ కరెన్సీ బాండ్లకు చెల్లింపుల గురించి ఇన్వెస్టర్లకు వివరిస్తోంది. రోడ్‌షో నిర్వహణలో భాగంగా అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లకు నిధులను సమకూర్చుకునే విధానం గురించి తెలియజేస్తోంది.
2015 నుంచి 2022 మధ్యకాలంలో అదానీ గ్రూప్ 10 బిలియన్ డాలర్ల నిధులను విదేశీ కరెన్సీ బాండ్ల రూపంలో పొందింది. ఆ మొత్తంలో 1.15 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లకు 2020, 2022లలోనే గడువు ముగిసింది. 2023లో ఎలాంటి చెల్లింపులు లేవు. అయితే, అదానీ పోర్ట్స్ తీసుకున్నటువంటి 650 మిలియన్ డాలర్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ తీసుకున్న 750 మిలియన్ డాలర్లు, 500 మిలియన్ డాలర్ల విలువైన బాండ్లకు 2024లో చెల్లింపులు చేయాలి. ఈ చెల్లింపులకు సంబంధించి అదానీ గ్రూప్ కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయంతో పాటు ప్రైవేట్ ప్లేస్‌మెంట్ నోట్ల జారీ ద్వారా చెల్లిస్తామని ఇన్వెస్టర్లకు వెల్లడించింది. కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని ఇదివరకే కొన్ని రోడ్‌షోలలో వివరించగా, ఈ నెల 7-15వ తేదీల మధ్య అమెరికా, దుబాయ్, లండన్ రోడ్‌షోలలో కూడా నిధులకు సంబంధించి హామీలివ్వనున్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.