- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదానీ కంపెనీల ర్యాలీతో ఎల్ఐసీకి రూ. 3,447 కోట్ల లాభాలు!
ముంబై: అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో మెరుగైన ర్యాలీ చేశాయి. హిండెన్‌బర్గ్ నివేదికలో ఆరోపించినట్లు షేర్ల విలువను అవకతవకలకు పాల్పడి పెంచేందుకు సెబీ నియంత్రణ వైఫల్యం ఉందని ప్రస్తుతానికి చెప్పలేమని సుప్రీం కోర్టు నిపుణులు కమిటీ ఇటీవల అత్యున్నత న్యాయస్థానానికి నివేదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కంపెనీ షేర్లు ఊపందుకున్నాయి. దాంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ సుమార్ రూ. 82 వేల కోట్లకు పైగా పుంజుకుంది.
హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత అదానీ షేర్లు ఈ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి. అయితే, అదానీ షేర్లు పుంజుకోవడం ద్వారా దేశీయ అతిపెద్ద బీమా దిగ్గజం ఎల్ఐసీకి రూ. 3,447 కోట్ల లాభాలొచ్చాయి. సోమవారం ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ లిస్టెడ్ సంస్థల షేర్లు 19 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు అదానీ గ్రూప్ తన కార్యకలాపాలకు నాన్-కోర్‌గా ఉన్న పలు స్థిరాస్తులను విక్రయానికి పరిశీలిస్తోందని నివేదికలు రావడంతో కంపెనీల షేర్లు పెరిగాయి. ఈ కారణంగా అదానీ షేర్లలో పెట్టుబడి పెట్టిన ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియో విలువ పెరిగింది.
Also Read..