- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు పొడిగించిన యూఐడీఏఐ!
న్యూఢిల్లీ: ఆధార్ కార్డుకు సంబంధించి వివరాల ఉచిత అప్‌డేట్ కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) మరోసారి గడువును పొడిగించింది. ఈ నెల 14తో ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో దీన్ని డిసెంబర్ 14వ తేదీ వరకు మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గడువు అనంతరం ఆధార్ డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసుకోవాలంటే నిర్దేశించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఇచ్చిన ఉచిత అప్‌డేట్ కోసం ప్రజల నుంచి పెద్ద ఎత్తున సానుకూలత కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గడువును పొడిగిస్తున్నాం. ఆధార్ పోర్టల్‌లో డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే విధంగా ప్రోత్సహించడమే తమ ఉద్దేశ్యమని యూఐడీఏఐ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
యూఐడీఏఐ నోటిఫికేషన్ ప్రకారం, ఆధార్ వివరాల్లో పేరు, పుట్టిన తేదీ చిరునామా, జెండర్ లాంటి అంశాలను గడువులోగా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆధార్ కార్డును తీసుకుని 10 ఏళ్లు గడిచిన వ్యక్తులు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచించింది. గత దశాబ్ద కాలంలో ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయనివారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడింది.