భారత విమానయాన సంస్థలకు అమెరికా బ్యాడ్ న్యూస్

by S Gopi |   ( Updated:2024-01-26 14:21:23.0  )
భారత విమానయాన సంస్థలకు అమెరికా బ్యాడ్ న్యూస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా ఏవియేషన్ రెగ్యులేటర్ తీసుకున్న నిర్ణయంతో భారత విమానయాన సంస్థలు సందిగ్ధంలో పడ్డాయి. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల తయారీని పరిమితం చేయాలని యూఎస్ ఏవియేషన్ రెగ్యులేటర్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతేడాది నుంచి వందలాది బోయింగ్ విమానాలను ఆర్డర్ చేసిన దేశీయ ఎయిర్‌లైన్ కంపెనీలు ఎయిర్ఇండియా, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ ఇరకాటంలో పడిపోయాయి.

ఇటీవల అలాస్కా ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం గాల్లో ఉన్న సమయంలోనే డోర్‌ప్లగ్ ఊడిపోయిన ఘటన సంచలనం రేపింది. ఇది కాకుండా ఈ విమానాల్లో పలు నాణ్యతాపరమైన లోపాలు బయటపడిన నేపథ్యంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఈ క్రమంలోనే 737 మ్యాక్స్ విమానాల ఉత్పత్తిని కొనసాగించేది లేదని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) స్పష్టం చేసింది. 'వీటి తయారీకి బోయింగ్ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వచ్చినా అంగీకరించడానికి సిద్ధంగా లేము. తనిఖీల తర్వాత నాణ్యత విషయంలో సంతృప్తికరంగా ఉండే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని' ఎఫ్ఏఏ వెల్లడించింది. ఎఫ్ఏఏ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు చెందిన మూడు విమానయాన సంస్థలపై ప్రభావం చూపనుంది. గతేడాది ఎయిర్ఇండియా 181 విమానాలను, ఆకాశ ఎయిర్ 204, స్పైస్‌జెట్ 142 విమానాలను ఆర్డర్ చేశాయి. దీంతో ఎఫ్ఏఏ నిర్ణయం వీటి డెలివరీలపై పడనుంది. దేశీయంగా కూడా నియంత్రణ సంస్థ డీజీసీఏ భారత్‌లో వాడుతున్న 737 మ్యాక్స్ విమానాల్లో తనిఖీలు చేసింది. కొన్ని విమానాల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించింది.

Advertisement

Next Story

Most Viewed