- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్విట్టర్‌కు పోటీగా ‘బ్లూ స్కై’ యాప్
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు పోటీగా మరో యాప్ వస్తున్నట్లు ఎప్పటినుంచో ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్త నిజమైంది. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌కు షాక్ ఇస్తూ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే ‘బ్లూ స్కై’ యాప్ ను తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ కోసం కొంతమంది ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీనిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత అందరికీ అందుబాటులోకి తేనున్నారు. ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఉపయోగించడానికి సులువుగా ఉండే విధంగా దీనిని లాంచ్ చేయనున్నారు.
నివేదికల ప్రకారం, iOS యాప్ స్టోర్‌లో బ్లూస్కై ఫిబ్రవరి 17నే అందుబాటులోకి వచ్చింది. దీనిలో ప్లస్ బటన్‌ను క్లిక్ చేసి 256 క్యారెక్టర్లతో పోస్ట్‌ను క్రియేట్ చేసేలా ఫీచర్‌ను అందించారు. షేర్, మ్యూట్, బ్లాక్ అకౌంట్స్, యాడ్ అకౌంట్స్, డిస్కవర్ ట్యాబ్, నోటిఫికేషన్స్, లైక్స్, రీపోస్టులు, రిప్లైలు, ఫాలోస్, రీసెంట్ పోస్ట్‌లు, ప్రొఫైల్ పిక్, బ్యాగ్రౌండ్, బయో మెట్రిక్ మొదలగు ట్విట్టర్‌లో ఉన్నటువంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే వినియోగదారుల ప్రయోజనాల కోసం మరిన్ని అత్యాధునిక ఫీచర్లను ‘బ్లూ స్కై’ యాప్ లో అందించారు.