5-డోర్లతో పాటు మరో అదిరిపోయే ఆప్షన్‌తో సరికొత్త థార్

by Harish |   ( Updated:2023-11-16 14:14:20.0  )
5-డోర్లతో పాటు మరో అదిరిపోయే ఆప్షన్‌తో సరికొత్త థార్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా నుంచి గతంలో విడుదలైన థార్ మోడల్ దేశవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇది 3-డోర్లను కలిగి ఉంది. అమ్మకాల పరంగా కొత్త రికార్డు నెలకొల్పింది. అయితే ఇదే మోడల్‌లో 5-డోర్లు కలిగిన థార్‌ను కంపెనీ ఎప్పుడు లాంచ్ చేస్తుందా అని వినియోగదారులు ఎదరుచూస్తున్నారు. ఇప్పుడు ఈ వేరియంట్ గురించి ఒక శుభవార్త వచ్చింది.

మహీంద్రా అండ్ మహీంద్రా యాజమాన్యం త్వరలో 5 డోర్లు కలిగిన థార్‌ను విడుదల చేయనుంది. అయితే ఈ వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌‌ ఆప్షన్‌ను కూడా అందించనున్నట్లు సమాచారం. ఈ వేరియంట్ గురించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. వీటిలో కనిపించిన దాని ప్రకారం, దీని డిజైన్ సరికొత్తగా వినియోగదారులకు నచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది.


ఈ 5 డోర్లు కలిగిన థార్‌ను 2024లో విడుదల చేయాలని చూస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ జెజురికర్ అన్నారు. గతంలో విడుదలైన మహీంద్రా 3-డోర్ థార్‌ ధర దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఉంది. తర్వాత రాబోయే 5 డోర్ల థార్ మరింత ఎక్కువ ధరలో లభించే అవకాశం ఉంది.

Advertisement

Next Story