ఒక్క రోజులో రికార్డు 4.1 కోట్ల నెఫ్ట్ లావాదేవీలు

by S Gopi |
ఒక్క రోజులో రికార్డు 4.1 కోట్ల నెఫ్ట్ లావాదేవీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఫిబ్రవరి 29న నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్) విధానంలో మొత్తం 4,10,61,337 లావాదేవీలను ప్రాసెస్ చేయడం ద్వారా సరికొత్త మైలురాయిని సాధించినట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం వెల్లడించింది. ఇది ఇప్పటివరకు ఒక రోజులో అత్యధిక నెఫ్ట్ లావాదేవీలని పేర్కొంది. గత పదేళ్లలో(2014-2023) నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ వ్యవస్థలు వరుసగా వాల్యూమ్ పరంగా 700 శాతం, 200 శాతం పెరిగాయి. విలువ పరంగా నెఫ్ట్ 670 శాతం, ఆర్‌టీజీఎస్ 104 శాతం పెరిగాయని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌టీజీఎస్ విధానంలో ఇప్పటివరకు అత్యధికంగా 2023, మార్చి 31న ఒక రోజులో 16.25 లక్షల లావాదేవీలు జరిగాయని ఆర్‌బీఐ వెల్లడించింది. నెఫ్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్(ఆర్‌టీజీఎస్) వ్యవస్థలు రిటైల్, హోల్‌సేల్ చెల్లింపులను సెటిల్ చేసేందుకు ఉద్దేశించినవి.

Advertisement

Next Story