Stock markets: స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్.. భారీ నష్టాల్లో సూచీలు

by Mahesh |
Stock markets: స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్.. భారీ నష్టాల్లో సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 ఆర్దిక సంవత్సరానికి గాను మొత్తం 48.21 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించారు. ఇందులో మొత్త ఆదాయం రూ. 32.07 కోట్లు కాగా.. పన్ను ఆదాయం రూ. 28. 83 లక్షల కోట్లు అలాగే అప్పులు పన్నేతర ఆదాయాలు రూ. 16 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ బడ్జెట్ పై గంపెడంతా ఆశలు పెట్టుకున్న స్టాక్ మార్కెట్లు భారీ షాక్ తగిలింది. ఆశించిన స్థాయిలో బడ్జెట్ లో కేటాయింపులు లేకపోవడంతో సెన్సెక్స్ 700, నిప్టీ 200 పాయింట్లు నష్టపోయింది. కాగా ప్రస్తుతం సెన్సెక్స్ 79,896 వద్ద కొనసాగుతుండగా.. నిప్టి 24,301 వద్ద కొనసాగుతుంది. అయితే ఈ నష్టాలు మార్కెట్ సమాయాలు ముగిసాసరికి పూడ్చుకుంటాయా లేక పూర్తిగా పతనం అవుతాయో వేచి చూడాల్సిందే మరి.



Next Story