GST Council To Conduct 48th Meeting On December 17

by Harish |   ( Updated:2022-11-26 13:17:14.0  )
GST Council To Conduct 48th Meeting On December 17
X

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 48వ జీఎస్టీ(వస్తువులపై వస్తు సేవల పన్ను) కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 17 న జరగనుంది. ఈ విషయాన్ని కౌన్సిల్ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. గత 47వ జీఎస్టీ సమావేశం జూన్ 29, 2022న చండీగఢ్‌లో జరిగింది. కానీ ఈసారి మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. గత సమావేశంలో ఎల్‌ఇడి ల్యాంప్స్, సోలార్ వాటర్ హీటర్లు, మెటల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌లు, టెట్రా ప్యాకెట్లు పై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు.

ప్రస్తుత సమావేంలో ముఖ్యంగా క్యాసినో, ఆన్‌లైన్ గేమింగ్‌పై చర్చ జరగనుంది. వీటిపై 28శాతం జీఎస్టీ విధించే అవకాశం ఉంది. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం, దీనిపై ఒక నివేదికను జీఎస్టీ క్యౌన్సిల్‌కు సబ్మిట్ చేయనుంది. అలాగే, నవంబర్ 25న కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్-జూన్ మధ్య వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిహారంగా రాష్ట్రాలకు రూ.17,000 కోట్లు విడుదల చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

Next Story