జోరు చూపించిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు

by Harish |   ( Updated:2023-02-11 09:06:10.0  )
జోరు చూపించిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
X

న్యూఢిల్లీ: భారతదేశ కార్పొరేట్, స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లలో స్థిరమైన వృద్ధి కనబడింది. ప్రభుత్వం నుంచి ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం.. కేంద్రం ఫిబ్రవరి 10, 2023 నాటికి మొత్తం రూ. 15.67 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులను వసూలు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 24.09 శాతం ఎక్కువ. వ్యక్తిగత ఆదాయ పన్ను పెరగడం వలన ఈ ఏడాది పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. రీఫండ్‌ల తరువాత ప్రభుత్వ ప్రత్యక్ష పన్ను వసూళ్లు గత ఏడాది కంటే 18.40 శాతం పెరిగి రూ. 12.98 లక్షల కోట్లకు చేరుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) పేర్కొంది.

అలాగే, కార్పొరేట్ ఆదాయపు పన్ను (సిఐటి) 19.33 శాతం వృద్ధి చెందగా, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 29.63 శాతం పెరిగాయి. ఫిబ్రవరి 10 వరకు రూ. 2.69 లక్షల కోట్ల రీఫండ్‌లను జారీ చేశారు. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జారీ చేసిన రీఫండ్‌ల కంటే 61.58 శాతం ఎక్కువ. రీఫండ్‌ల సర్దుబాటు తర్వాత, కార్పొరేట్ పన్ను వసూళ్లలో నికర వృద్ధి 15.84 శాతం, వ్యక్తిగత పన్ను వసూళ్లలో 21.93 శాతంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed