మహీంద్రా మోడళ్లపై రూ.1.25 లక్షల భారీ తగ్గింపు.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే

by Harish |   ( Updated:2023-09-14 06:37:43.0  )
మహీంద్రా మోడళ్లపై రూ.1.25 లక్షల భారీ తగ్గింపు.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ కంపెనీ మహీంద్రా సెప్టెంబర్ నెలలో ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. XUV400, Marazzo, XUV300, Bolero, Bolero Neo వంటి మోడళ్లు డిస్కౌంట్ ఆఫర్‌లతో అందుబాటులో ఉన్నాయి.


మహీంద్రా XUV400 కారు రూ.1.25 లక్షల ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. మహీంద్రా మరాజో మోడల్‌పై కూడా రూ.73,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో రూ.58,000 క్యాష్ తగ్గింపు, రూ. 15,000 విలువైన ఇతర తగ్గింపులు లభిస్తాయి. మహీంద్రా XUV300 పై రూ. 71,000 వరకు తగ్గింపు ఉంది. బొలెరో నియో మోడల్‌పై రూ. 7,000-35,000 మధ్య క్యాష్ తగ్గింపుతో పాటు, రూ. 15,000 విలువైన యాక్సెసరీల తగ్గింపు కూడా ఉంది. బొలెరో పై రూ.25,000 నుండి రూ.60,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి.



Advertisement

Next Story

Most Viewed