2030 నాటికి 10 లక్షల ఈవీ విక్రయాలే లక్ష్యం: JSW-MG మోటార్స్ జాయింట్ వెంచర్

by Harish |   ( Updated:2024-03-20 08:16:30.0  )
2030 నాటికి 10 లక్షల ఈవీ విక్రయాలే లక్ష్యం: JSW-MG మోటార్స్ జాయింట్ వెంచర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: JSW గ్రూప్-MG మోటార్స్ మధ్య ఏర్పడినటువంటి జాయింట్ వెంచర్ 2030 నాటికి భారతదేశంలో 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుందని JSW గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బుధవారం తెలిపారు. ఈ వెంచర్ ప్రీమియం ప్యాసింజర్ వాహన విభాగంలోకి ప్రవేశించాలని చూస్తుందని కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం MG మోటార్స్ రెండు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తుంది. అవి కామెట్ EV, మరో SUV మోడల్ ZS EV.

JSW గ్రూప్ వారసుడు పార్త్ జిందాల్ మాట్లాడుతూ, దశాబ్దం చివరినాటికి కంపెనీ ఈవీ మార్కెట్‌లో 33 శాతం దృష్టి పెట్టిందని చెప్పారు. భారత్ చమురు దిగుమతి చేసుకునే దేశం, దీంతో అధిక కరెంట్ ఖాతా లోటు ఉంది. దేశం నిజమైన ఆత్మనిర్భర్‌గా మారడానికి ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం ఉత్తమమైన మార్గం అని అన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో ప్రభుత్వ మద్దతుతో భారత్‌లో ఈవీ వాహనాల వినియోగం భారీగా వృద్ధి చెందుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఈవీ పాలసీకి ఆమోదం తెలపడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ ఈవీ కంపెనీలు తమ పెట్టుబడులను భారత్‌లో పెట్టడానికి ముందుకు వస్తాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed