- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FISCO: ఎక్కువ వివరాలు అడిగితే బ్యాంకు ఖాతాలు వద్దంటున్న భారతీయులు
దిశ, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వినియోగదారులు ఆర్థిక సంబంధ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు పడుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ సేవలకు సంబంధించి మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది. ప్రముఖ గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ ఫిస్కో చేసిన సర్వేలో సగానికి పైగా(58 శాతం) భారతీయులు సేవింగ్స్ ఖాతా తెరిచేందుకు ఎక్కువ వివరాలు అడిగితే బ్యాంకు ఖాతా తెరిచేందుకు కూడా తిరస్కరిస్తున్నారని తేలింది. సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించేందుకు ఉద్దేశించిన దరఖాస్తులో చాలామంది 10 కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగితే అందుకు సమాధానం రాయకుండా ప్రక్రియను వదులుకుంటున్నారని సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో కొత్త అకౌంట్ తెరిచే ముందు వినియోగదారులు ఈ పద్దతిని అనుసరిస్తున్నారు. సులభమైన పద్దతిలో వారు అకౌంట్ ప్రారంభించే వెసులుబాటులు ఆశిస్తున్నారు. గత కొన్నేళ్లలో వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న ఘటనల నేపథ్యంలోనే వారు ఈ తరహా తిరస్కరణను అనుసరిస్తున్నారని సర్వే అభిప్రాయపడింది. దాదాపు ఐదుగురిలో ఇద్దరు(38 శాతం మంది) వినియోగదారులు ఎక్కువ వివరాలు అడుగుతున్న కారణంగా ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాలను వాడేందుకు ఇష్టపడటం లేదు. కొందరు ఆయా ఖాతాలను ఉపయోగించడం తగ్గించేశారు. గతేడాది కాలంలో 10 మందిలో ఏడుగురు బ్యాంకు అకౌంట్ లాగ్-ఇన్ సమయంలో 64 శాతం, ఆన్‌లైన్ కొనుగోలు సమయంలో 67 శాతం మంది ఇలాంటి ఎక్కువ తనిఖీలను గమనించారు. పది మందిలో ఒకరు నకిలీ ఖాతాలకు తమ వివరాలు ఉపయోగించారేమోనని 13 శాతం మంది సందేహం వ్యక్తం చేశారు.