- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా చేస్తే.. మూడు నెలలు బీర్ ఫ్రీ !
దిశ వెబ్ డెస్క్ : కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అన్ని దేశాల్లోనూ వ్యాప్తి చెందిన.. కరోనా.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఇటలీలో వేలాదిమందిని కబలించిన కరోనా.. ప్రస్తుతం అమెరికాను కుదిపేస్తోంది. భారత్,అమెరికాలతో సహా.. చాలా దేశాల్లో లాక్ డౌన్ నడుస్తోంది. కరోనాకు భయపడి … ప్రజలు కూడా గడప దాటి బయటకు రావట్లేదు. ఈ నేపథ్యంలోనే.. యానిమల్ షెల్టర్స్‌ను నడిపే సంస్థలు కూడా మనుషులను రానివ్వడం లేదు. కరోనా ఇప్పటివరకు మనిషి నుంచి మనిషులకు మాత్రమే సోకుతుండగా.. ఒక వేళ మనిషి నుంచి జంతువులకు సోకితే.. ప్రమాదమని భావించిన మనుషులను రానివ్వకుండా ఆయా సంస్థలు జాగ్రత్త పడుతున్నాయి. ఈ కారణంగానే జంతువుల సందర్శనను మూసివేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. న్యూయార్క్‌లోని మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ తమ షెల్టర్‌లో ఉన్న కుక్కలను దత్తత ఇచ్చేందుకు సిద్దమయ్యాయి. మనుషుల సందర్శన ఆగిపోవడంతో కుక్కలను మనుషుల వద్దకు చేర్చాలని సంస్థ నిర్ణయించింది. అయితే కరోనా నేపథ్యంలో కుక్కలను దత్తత తీసుకోవడానికి ఎంత మంది ముందుకు వస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో బుష్ బీర్ అనే కంపెనీతో మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ కలిసి వినూత్న దారిని ఎంచుకుంది.
ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా ఉన్న దేశంగా అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. 1,42,735 మంది కరోనా బారినపడ్డారు. 2,488 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకు ఈ సంఖ్య పెరిగిపోతూ ఉన్నది. మరో రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశముందని స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అన్నాడంటే.. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో లక్ష మందికి పైగా ప్రాణాలకు కరోనా బలి తీసుకునే ముప్పుందని ఆ దేశ ఆరోగ్య శాఖ నిపుణుడు ఆంథోని పాసీ అంచనా వేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మూగ జీవాలైన శునకాలను కాపాడేందుకు అమెరికాలోని మిన్నెసోటాలో ఉన్న మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ ఓ సరికొత్త ఆలోచన చేసింది. ఎవరైతే కుక్కను దత్తత తీసుకుంటారో వారికి మూడు నెలలకు సరిపడా బీర్లను బుష్ బీర్ కంపెనీ ఉచితంగా అందిస్తుంది. కుక్కను దత్తత తీసుకున్న వారు.. ప్రూఫ్ కింద కుక్కతో ఫొటో దిగి బుష్ బీర్ కంపెనీ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలకు పంపించాల్సి ఉంటుంది. మొదటగా పంపించే వారికి 100 డాలర్ల రివార్డ్ కూడా ప్రకటించింది. కాగా.. ఈ కొత్త ఐడియాతో మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ ముందు మనుషులు క్యూ కట్టారు. మరోపక్క ఈ కాంటెస్ట్ కేవలం మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు మాత్రమే ఉండనున్నట్టు బుష్ బీర్ కంపెనీ తెలిపింది. దాదాపు 500 కుక్కలను దత్తత ఇవ్వాలని నిర్ణయించింది.
Tags : corona virus, lockdown, america, dogs, adopt, beer, free, 3 months