ఘోర రోడ్డు ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు (వీడియో)

by Anukaran |   ( Updated:2021-12-15 03:37:19.0  )
ఘోర రోడ్డు ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 9మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే బస్సు అశ్వారావు పేట నుంచి జగ్గారెడ్డి గూడెం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. కాగా ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సమంత బోల్డ్ లుక్స్.. రికార్డులు బద్దలు కొడుతున్నాయిగా!

సామ్‌తో విడాకులపై స్పందించిన చై.. అదే నిజమా..?

Advertisement

Next Story